నీలగిరి, నవంబర్ 14: నల్లగొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రభుత్వ వైద్య కళాశాల ర్యాగింగ్ వ్యతిరేక జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటనలపై చర్చించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అనునిత్యం విద్యార్థులను పర్యవేక్షిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.
మరోమారు ఇలాంటివి పునరావృతం అయితే తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ఇన్చార్జి డీఆవ్వో అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల అదనపు ప్రిన్సిపాల్ రాధాకృష్ణ, సామాజిక కార్యకర్త సురేశ్ గుప్తా, ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్అరుణకుమారి, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.