నీలగిరి, డిసెంబర్ 8 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్క్రిష్ణారెడ్డి అన్నారు. లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ, దేవరకొండ రోడ్, రైల్వేస్టేషన్ సావర్కర్ నగర్లో పనులను అదనపు కలెక్టర్ ఖుష్భు గుప్తాతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 12న నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. విద్యార్థులు ఎక్కువగా పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డీఈఓ భిక్షపతి. జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వర్రావు, మున్సిపల్ అధికారులు ఉన్నారు.