అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు జూన్ 5 కల్లా పూర్తి చేయాలి
జిల్లాలోని 584 అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు జూన్ 5 కల్లా పూర్తి చేయాలని సూర్యాపేట కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. సూర్యాపేట పట్టణ పరిధి బాషానాయక్తండాలోని మండల పరిషత్ పాథమిక పాఠశాలలో జరుగుతున్న పనులను సోమవారం కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు.
- 576 పాఠశాలల్లో కమిటీలు ఏర్పాటు
- ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
- సూర్యాపేట కలెక్టర్ వెంకట్రావ్
సూర్యాపేట రూరల్, ఏప్రిల్ 15 : జిల్లాలోని 584 అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు జూన్ 5 కల్లా పూర్తి చేయాలని సూర్యాపేట కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. సూర్యాపేట పట్టణ పరిధి బాషానాయక్తండాలోని మండల పరిషత్ పాథమిక పాఠశాలలో జరుగుతున్న పనులను సోమవారం కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. జిల్లాలోని గుర్తించబడిన 584 ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం వసతుల కల్పన కోసం తాగునీరు, విద్యుత్, బాలికల టాయిలెట్స్ సుందరీకరణ పనులు చేపట్టిందని తెలిపారు.
576 పాఠశాలలో కమిటీలు ఏర్పాటు చేశామని, 555 పాఠశాలల కమిటీలు బ్యాంకు ఖాతాలను ప్రారంభించాయని, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం పిల్లలమర్రి గ్రామంలో పీఏసీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లను చూసి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తేమ శాతం యంత్రం ద్వారా రైతులు తెచ్చిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులు ఆరబెట్టుకొని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న రైతులు ఐరిష్ వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంట మున్సిపల్ డీఈ ప్రసాద్, పీఏసీఎస్ అధికారులు వెంకట్‌రెడ్డి, వెంకటేశ్, సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

