ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
ఈ నెల 28 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఇంటర్ పరీక్షల నిర్వహణపై అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు.
- సమీక్షా సమావేశంలో కలెక్టర్ వెంకట్రావ్
సూర్యాపేట, ఫిబ్రవరి 19 : ఈ నెల 28 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఇంటర్ పరీక్షల నిర్వహణపై అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరిగే పరీక్షలకు ఆటంకాలు కలుగకుండా నిర్వహించాలన్నారు. జిల్లాలోని 77 కళాశాలల్లో 16,602 మంది విద్యార్థులు ఉండగా, పరీక్షల కోసం 32 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రాలను 9 జోన్లుగా విభజించామని, పరీక్షల నిర్వహణ కోసం ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్స్, 3 టీమ్‌ల సిట్టింగ్ స్క్వాడ్స్, 850 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీక్షలో జడ్పీ సీఈఓ అప్పారావు, డీఆర్డీఓ మధుసూదన్‌రాజు, డీఈసీ సభ్యులు లక్ష్మయ్య, శ్రీధర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

