నీలగిరి, జూలై 15: ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులను ఒకటికి రెండుసార్లు చదివి ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యను తెలుసుకొని పరిష్కరించాలన్నారు. ఎట్టి పరిస్థ్ధితుల్లోనూ జాప్యం చేయవద్దని తెలిపారు. సోమవారం 78 ఫిర్యాదులు కాగా అందులో వ్యక్తిగత సమస్యలు, భూ సంబంధిత సమస్యలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు హస్టల్ సీట్ల వంటివి ఉన్నాయి.
గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలకు సాధికారత కల్పించడంలో భాగంగా రాష్ట్ర ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన ఇంటింటా ఇన్నోవేషన్ వాల్ పోస్టర్‌ను కలెక్టర్ సమవేశ మందిరంలో అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణప్రాంతాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో రూపొందించిన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు. ఆగస్టు 3లోగా నూతన అవిష్కరణలు చేసి చిత్రాలు, వీడియోలు 9100678543 నంబర్‌కు వాట్సప్ ద్వార పంపించాలన్నారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు టి.పూర్ణచంద్ర, జే.శ్రీనివాస్, డీఆర్ఓ రాజ్యలక్ష్మి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డీపీఓ మురళి, జిల్లా కోఆర్డినేటర్ మాలోతు అఖిల్ ఉన్నారు.
చందంపేట : సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాసీల్దార్ లక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాస్ కోరారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా వాణిలో ప్రజా సమస్యలపై వినతులను సమర్పించారు. కాగా దేవరకొండ డివిజన్ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజావాణిలో 494, చందంపేటలో 171, డిండిలో 17, చింతపల్లి 33, పీఏపల్లి 34, నేరేడుగొమ్ము 26, కొండమల్లేపల్లి 34, దేవరకొండలో 179 దరఖాస్తులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు.
నార్కట్‌పల్లి : బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం కుడి, ఎడమ కాల్వల మట్టిని అక్రమంగా నార్కట్‌పల్లికి చెందిన వడ్డెన వెంకన్న టిప్పర్లతో తరలి స్తున్నారని ఆయనపై తీసుకోవాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అల్లె పరమేశ్ సోమవారం ప్రజావాణిలో తాసీల్దార్ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. మట్టిని సంరక్షించాల్సిన బాధ్యత అధికారులదేనని వినతి పత్రంలో పేర్కొన్నారు.
చిట్యాల: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా వాణిలో 10 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ జయలక్ష్మి తెలిపారు. మున్సిపాలిటీకి సంబంధించినవి 1, రెవెన్యూకు సంబంధించి 8, మండల పరిషత్‌కు సంబంధించి -1 అని ఆమె వివరించారు.