తిరుమలగిరి నవంబర్ 11: సరైన తేమ శాతంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని జాప్యం లేకుండా వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. మంగళవారం తిరుమలగిరి మండల పరిధిలోని తొండ, కోక్యానాయక్ తం డా, నాగారం మండలంలోని ఫణిగిరిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా తొండలోని ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని తనిఖీ చేసి, కొనుగోలు కేంద్రానికి ట్యాగింగ్ చేసిన మిల్లుల వివరాలు, ధాన్యంలోని తేమ శాతాన్ని పరిశీలించారు.
తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టన తర్వాత ముందు పం పించాలని ఇది వరకే చెప్పామని, ధాన్యం తడిసినప్పటికీ ఇబ్బంది లేకుండా మిల్లులకు పంపించాలని, పౌర సరఫరాల శాఖ అధికారులు మిల్లర్లతో మాట్లాడి ధాన్యం తీసుకెళ్లే విధంగా చర్చించాలన్నారు. అనంతరం కోక్యా నాయక్ తండాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి, ధాన్యం డ్రయ్యర్‌ను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లోని రిజిస్టర్లను పరిశీలించారు. 57 మంది రైతులు ధాన్యం తెచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఫణిగిరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి ఏవో, ఏఈవోల వివరాలులు అడిగి వారితో మాట్లాడారు. ట్రక్ షీట్ వివరాలు, ఇప్పటి వరకు చేసిన చెల్లింపులను తెలుసుకున్నారు. ట్యాబ్ ఎంట్రీ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేసి తూకం సరైన విధంగా ఉండేలా చూసుకోవాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మోహన్‌బాబు, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ రాము, తాసీల్దార్ హరిప్రసాద్, ఏవో నాగేశ్వరావు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. అనంతరం తిరుమలగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసి, విద్యార్థుల స్టడీ అవర్స్‌ను పరిశీలించారు. విద్యార్థుల సౌకర్యార్థం నూతన భవనం పూర్తయ్యే వరకు అదనంగా ఇనుప షెడ్లు నిర్మించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో లాజర్, ఎంఈవో శాంతయ్య కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.