నిడమనూరు, డిసెంబర్ 23 : ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించిన నిడమనూరు మండలంలోని తుమ్మడం పంచాయతీ కార్యదర్శి గంగుల లింగయ్యకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రశంసాపత్రం అందజేశారు. ఎన్నికల విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పంచాయతీ కార్యదర్శులను మండలానికి ఒకరిని ఎంపిక చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయనకు ప్రశంసా పత్రం అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హిమబిందు, సూపరింటెండెంట్ బోనగిరి రమేశ్, సీనియర్ అసిస్టెంట్ రాధాకృష్ణ పాల్గొన్నారు.