సామాన్య ప్రజలు తాసీల్దార్ కార్యాలయం మెట్లు ఎక్కాలంటేనే వణికిపోతున్నారు. ఏ పనికైనా పచ్చనోటు చూపితేనే పనిచేసే పరిస్థితి దాపురించడంతో బలహిన వర్గాలు, రైతులు కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా పను లు కావడం లేదనే దుస్థితి నెలకొన్నది. దీంతో దళారుల మధ్యవర్తిత్వంతో ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని ప్రజలు వాపోతున్నారు.
కట్టంగూర్, మే 31 : రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు లేనివారికి కొత్తవి మంజూరు చేస్తామని ప్రకటించడంతో రేషన్‌కార్డుల మంజూరు కట్టంగూర్ తాసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వరంగా మారింది. రేషన్‌కార్డుల జారీలో అర్హులైన అమాయకుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది. స్థానికంగా వినిపిస్తున్న ఫిర్యాదుల మేరకు.. రేషన్‌కార్డు ఇప్పిస్తా.. రూ.వెయ్యి నుంచి రూ.2వేలు కొట్టు.. అంటూ ఓ మహిళా అధికారితోపాటు మరికొందరు అధికారులు డిమాం డ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారిని ఆసరాగా చేసుకుని కార్యాలయ సిబ్బంది లం చాలు వసూలు చేస్తున్నట్లు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు తీ వ్ర చర్చనీయాంశంగా మారడంతో స్థానిక ప్రజలు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అర్హులకు రేషన్‌కార్డులు మంజూరు చేయడంతోపాటు అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఓ మేజర్ గ్రామపంచాయతీతోపాటు మరో రెండు గ్రామాల రేషన్‌కార్డుల దరఖాస్తులను ధ్రువీకరించే ఓ మహిళా అధికారి రూ.వెయ్యి నుంచి రూ.2వేలు వసూ లు చేస్తుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సదరు అధికారి డబ్బులు నేరు గా తీసుకోకుండా కుటుంబ సభ్యులు లేదా మధ్యవర్తులకు ఫోన్‌పే ద్వారా పం పించమంటున్నదని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. డబ్బులు తీసుకున్నట్లు ఎవరికైనా చెబితే రేషన్‌కార్డు రాదని తెగేసి చెబుతుందని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.