కట్టంగూర్: సీఏం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అంద జేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఈదులూరు గ్రామానికి చెందిన పనస సత్తయ్య అనా రోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఆతనికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.1.50లక్షల చెక్కు ను శనివారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో బాధితుడికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆదుకున్న ఘనత సీఎం కేసీ ఆర్కే దక్కుతుందన్నారు. గతంలో సీఎం రిలీఫ్‌ఫండ్ అంటే ఎవరికీ తెలియని పరిస్థితి ఉండేదని టీఆర్ఎస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వాత మానవతా దృక్పథంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అందజేస్తు న్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, కట్టంగూర్ ఉప సర్పంచ్ అంతటి శ్రీను, టీఆర్ఎస్ నాయకులు నకిరేకంటి నర్సింహా, గ్రామాధ్యక్షుడు ఇప్పలపల్లి శ్రీను, పెద్ది మల్లేశ్ పాల్గొన్నారు.