మిర్యాలగూడ, అక్టోబర్ 1 : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ అయిన సీఎంఆర్ షాపింగ్‌మాల్‌ను పట్టణంలోని సాగర్‌రోడ్డులో ఆదివారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ.. ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సీఎంఆర్ షాపింగ్ మాల్ బ్రాంచ్‌ను మిర్యాలగూడలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి సంస్థలు మిర్యాలగూడకు రావడంతో పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అదేవిధంగా మిర్యాలగూడ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సంస్థ రూ.25 లక్షల విరాళం అందించడం అభినందనీయమన్నారు. సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ మాట్లాడుతూ.. సీఎంఆర్ షాపింగ్ మాల్ ద్వారా మిర్యాలగూడ ప్రజలకు కావాల్సిన తక్కువ ధరలకే వస్ర్తాలు అందించనున్నట్లు తెలిపారు. షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా సినీ తార రాశీఖన్నా సందడి చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, లయన్స్ క్లబ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేశ్, నాయకులు చిలుకూరి రమాదేవీశ్యాం పాల్గొన్నారు.