నల్లగొండ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బతుకమ్మ పండుగ కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను నకిరేకల్ మున్సిపాలిటీలోని సాయిబాబా కళ్యాణ మండపంలో ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ నాయకుడు చేయని ఆలోచనలతో సీఎం కేసీఆర్ దేశ వ్యాప్తంగా సంచలన రాజకీయ నాయకుడిగా చరిత్రలోకెక్కరన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను సీఎం కేసీఆర్దేశవ్యాప్తంగా చాటి చెప్పారని తెలిపారు.
సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ బతుకమ్మ విశ్వవ్యాప్తమైందని పేర్కొన్నారు. బతుకమ్మ చీరలతో నేతన్నలకు మెరుగైన ఉపాధి లభించిందని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు.