దశాబ్దాలుగా అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం పోడు పట్టాలు ఇచ్చి వారికి భరోసా కల్పించారు. నిత్యం ఘర్షణలతో భయంగా సాగు చేసుకునే పరిస్థితి నుంచి వారికి విముక్తి కల్పించారు. పాత పోలీస్ కేసులు కూడా ఎత్తివేశారు. అంతేకాకుండా రైతుబంధు ఇచ్చి అండగా నిలిచారు. దామరచర్ల మండలంలో 532 మందికి చెందిన వెయ్యి ఎకరాలకు పోడు పట్టాలు వచ్చాయి. దాంతో కృష్ణా, మూసీ తీరంతోపాటు పలుచోట్ల గిరిజనులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. తమకు జీవనాధారమైన భూములపై శాశ్వత హక్కు కల్పించి ఆదుకున్న సీఎం కేసీఆర్కు గిరిజనులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
దామరచర్ల, నవంబర్ 15 : అటవీ భూమిని సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పట్టాలు ఇస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చడంతో రైతులు ఆ భూములను సాగుచేస్తూ మేలైన పంటలు పండిస్తున్నారు. మండలంలోని సన్న, చిన్నకారు రైతులు అటవీభూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేండ్లుగా భయం భయంగా వర్షాధార పంటలను మాత్రమే సాగు చేసేవారు. అటవీ శాఖ అధికార్లు కొన్ని సమయాల్లో వేసిన పంటలను తొలగించి కేసులు నమోదు చేసిన సంఘటనలున్నాయి. పలుసార్లు ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. స్వరాష్ట్రంలో నేడు ఆ పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పోడు పట్టాలతో సగర్వంగా వారికి నచ్చిన పంటలు సాగు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు.
మండలంలోని కృష్ణా, మూసీ నదుల తీరంలోని అటవీ భూముల్లో గిరిజనులు కొన్నేండ్లుగా సాగు చేసేవారు. కేవలం వర్షాధార పంటలైన పత్తి, మినుము, కంది తదితర పంటలు మాత్రమే వేసేవారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ హామీ మేరకు మండలంలోని దామరచర్ల, కల్లేపల్లి, తిమ్మాపురం, రాళ్లవాగుతండా, కేశవాపురం, తెట్టెకుంట, రామోజీతండా, ఎల్బీతండా, దిలావర్పూర్, వీర్లపాలెం పరిసర గ్రామాల్లోని 532 గిరిజన కుటుంబాలకు వెయ్యి ఎకరాలకు పట్టాలు అందజేశారు. దాంతో అధికారుల భయం లేకుండా కృష్ణా, మూసీ నదుల తీరంలోని అటవీ భూములకు పైపులైన్లు వేసుకొని వరితోపాటు పత్తి, మిర్చి సాగు చేసుకుంటున్నారు. కొంత మంది రైతులు పొలాల్లో బోర్లు వేయించుకుంటున్నారు. విద్యుత్ సరఫరా ఉన్న రైతులు బోర్లు బిగించి సాగు చేసుకుంటున్నారు. ఆశించిన రీతిలో వరి దిగుబడి రావడం, మద్దతు ధర అధికంగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు నిత్యం ఒక గండంగా ఉండేది. అటవీ శాఖ అధికారులు వచ్చి ట్రాన్స్ఫార్మర్లు తొలగించడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం, పైపులైన్లు పగులగొట్టడం, కేసులు నమోదు చేయడం నిత్యం పరిపాటిగా ఉండేది. దాంతో గిరిజన రైతులు వివిధ రకాలుగా నష్టపోయారు. స్వరాష్ట్రంలో, సీఎం కేసీఆర్ పాలనలో పోడు భూములకు పట్టాలు అందజేయడంతో సమస్యలన్నీ తొలిగి గిరిజన రైతులంతా సంబురంగా సాగు చేసుకుంటున్నారు. అంతేకాకుండా గతంలో రైతులపై సుమారు 120 కేసులు నమోదు కాగా, వాటిని కూడా ఎత్తివేస్తున్నట్లు చెప్పడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.