విధుల్లో చేరిన 410 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు
- సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
నల్లగొండ, ఆగస్టు 11: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం విధుల్లో చేరారు. రెండేండ్ల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి సస్పెండ్ చేసిన ప్రభు త్వం విధుల్లో చేరాలని సూచించింది. దాంతో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు జిల్లా కేంద్రంలోని గ్రామీణాభివృద్ధి సంస్థ డీఆర్డీఓ కార్యాల యంలో జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. జిల్లాలో మొత్తం 457 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండగా తొలి రోజు గురువారం 410 మంది జాయిన్ అయ్యారు. మిగిలిన వారు వెంటనే చేరాలని డీఆర్డీఓ కాళిందిని పేర్కొ న్నారు. జాయిన్ అయిన వారి వివరాలను ఆయా మండలాల్లోని కార్యాలయాలకు పంపనున్నారు.
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం..
రెండేండ్ల తర్వాత విధుల్లో చేరిన ఫీల్డ్ అసిస్టెంట్లు డీఆర్డీఓ కార్యాలయంలో జాయినింగ్ రిపోర్టు ఇచ్చిన అనంతరం అదే కార్యాలయంలో సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అంకెపాక జనార్దన్ మాట్లాడుతూ తామంతా బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములమవుతామన్నారు. కార్యక్రమంలో సంఘం నేతలు ఎన్. శంకర్, మల్లేశ్, కృపాకర్, రవి, అంజయ్య, వెంకన్న, బుచ్చయ్య,భాగ్యమ్మ,తులసి, రాము లమ్మ, ఫక్రుబాబా పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- anointed Flexi
- CM KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

