తుంగతుర్తి, జనవరి 13 : యువత తమ క్రీడా ప్రతిభను కనబరచడానికి సీఎం కప్ పోటీలు సువర్ణ అవకాశమని ఎంపీఓ సందీప్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని సీఎం కప్ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 17 నుంచి 22 వరకు గ్రామీణ స్థాయిలో క్రీడలు నిర్వహించి ప్రతిభ చాటిన క్రీడాకారులను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తామన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ యాకయ్య, సెక్రెటరీ రఘు, ఉప సర్పంచ్ పాల్గొన్నారు.