సూర్యాపేట, మార్చి 22 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. శనివారం పదో తరగతి హిందీ పరీక్ష నిర్వహిస్తుండగా 60 ఫీట్ రోడ్డులోని కాకతీయ హైస్కూల్ లో పరీక్ష తీరును ఆయన పరిశీలించారు. పరీక్షా కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను ఆరా తీశారు. పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పక్కాగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట సూర్యాపేట తాసీల్దార్ శ్యామ్సుందరెడ్డి ఉన్నారు.