రామగిరి, ఫిబ్రవరి12 : కార్మిక చట్టాలను రక్షించుకోవాలంటే ఐక్య పోరాటాలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, సీపీ ఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు అం బటి సోమయ్య, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేశ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాస్నేత పిలుపునిచ్చారు. దేశ వ్యాప్త స మ్మెలో భాగంగా గురువారం నల్లగొండలోని సుభాశ్ విగ్రహం నుంచి గడియారం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ఆచారి, దొనకొండ వెంకటేశ్వర్లు, అవుట రవీందర్, బొంగురాల నరసింహ, పాణ్యం వెంకట్రావు, చింతకాయల సంతోశ్, పరిపూర్ణాచారి, పందిరి శ్యాంసుందర్, ఎన్ఆర్సీ రాజు, కందుల నరసింహ, నందం మారయ్య గంజి నాగరాజు, వెంకన్న, కత్తుల యాదయ్య, పెరిక కృష,్ణ సాగర్ల మల్లయ్య, భీమనపల్లి శంకర్, బోడ ఇస్తారి, గుండె రవి, రేవెల్లి యాదయ్య పాల్గొన్నారు.
మిర్యాలగూడటౌన్, ఫిబ్రవరి 12: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఏఐటీయూసీ, సీఐటీయూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సబ్‌కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ సీహెచ్ సుజాత, రాణి, ప్రమీల, స్వరాజ్యం, రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి బిల్లా కనకయ్య, సాలె జగన్, వజ్రమ్మ, కవిత, రాధాబాయి, భవానీ, రాంబాయమ్మ తదితరులు పాల్గొన్నారు.
గుర్రంపోడ్, ఫిబ్రవరి 12: కార్మిక సంఘాల పిలుపు మేరకు మండల కేంద్రంలో వామపక్ష రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ ఎంఎల్ నల్గొండ జిల్లా కార్యదర్శి జకుల నరసింహ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. సమ్మెకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మద్దతు ప్రకటిస్తున్నట్లు మండల అధ్యక్షుడు కోదాటి మధుసూదన్, ప్రధాన కార్యదర్శి భూతం సైదులు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ నల్గొండ జిల్లా కార్యదర్శి జకుల నరసింహ, సీపీఎం మండల కార్యదర్శి వనమాల కామేశ్వర్, సీపీఐ మండల కార్యదర్శి రేపాక లక్ష్మీపతి, సీఐటీయూ మండల అధ్యక్షుడు సర్వయ్య, కార్యదర్శి ఆంజనేయులు, మంటి పిల్ల ఆంజనేయులు, కుందన పెళ్లి సత్తయ్య, నల్ల పుమార్ కొండయ్య, నీలకంఠం శివయ్య, గోర్ల వెంకటేశ్వర్లు, ఆశా వరర్ల సంఘం అధ్యక్షురాలు హఫీజ, పద్మ నేరెళ్ల శ్యామల, మండల ముత్యాలమ్మ, కార్మికులు బలే ముత్యాలు, గొర్ల చంద్రయ్య పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 12: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం నార్కట్‌పల్లిలో నర్ర రాఘవరెడ్డి స్మారక భవనంలో సభ నిర్వహించారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు నశించాలన్నారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలన్నారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చింతపల్లి బయ్యన్న, అరుణజ్యోతి, సైదులు, వెంకటేశ్వర్లు, శంకర్, ఐలయ్య, సైదులు, నాగరాజు. ఎల్లయ్య, రమేశ్, లింగస్వామి, ఈశ్వర్, ఎల్లయ్య, యాదగిరి, శ్రీకాంత్, రవి, కలమ్మ, వసంత, సతీశ్, లింగయ్య, వెంకన్న, షకీల్, మల్లేశ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కట్టంగూర్, ఫిబ్రవరి 12: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ జిల్లా నాయకులు లకపక రాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లులను రద్దు చేయాలని నిరసిస్తూ గురువారం కట్టంగూర్‌లో ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్లను రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ మండల కన్వీనర్ చెరుకు జానకి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో పొన్న అంజయ్య, తవిటి వెంకటమ్మ, పొడిచేటి సులోచన, మురారి మోహన్, పెంజర్ల కృష్ణ, గద్దపాటి ఇస్తారి, ఊట్కూరి మల్లేశ్, ఏరు చంద్రయ్య, చిత్రం కృష్ణ, అక్బర్ సలీం, వెంకటయ్య, పలస యాదయ్య, వెంకన్న, శ్రీను, ధనలక్ష్మి, భూపతి రేణుక పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి, ఫిబ్రవరి 12: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నూనే రామస్వామి, సీపీఐ మండల కార్యదర్శి గుమ్మకొండ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సీపీఐ పార్టీ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో గమ్మకొండ వెంకట్‌రెడ్డి, సామ్లానాయక్, మొహినొద్దీన్, అలమొని మల్లయ్య, ముదిగొండ లక్ష్మయ్య, హరి రాంబాబు, కృష్ణయ్య, శిభారాణి, చరణ్‌రెడ్డి; కోట్ల శిభ, మాణిక్యమ్మ, జ్యోతి పాల్గొన్నారు .
శాలిగౌరారం, పిబ్రవరి 12: గురువారం మండల కేంద్రంలో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి గ్రామం చివరి వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి చెలకాని మల్లయ్య, గుండ్లపెల్లి వెంకన్న, జగన్, నక్కల జ్యోతి, బల్లెం వెంకటయ్య, సోమలింగం, రాములు, కల్లూరి రేణుక, మమత పాల్గొన్నారు.
మునుగోడు, ఫిబ్రవరి 12: కార్మికులకు మరణ శాసనమైన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏఐటీయూసీ, సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘాలు, కార్మికులు మునుగోడులో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురుజ రామచంద్రం, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, సీపీఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేశం, ఏఐటీయూసీ మండల కార్యదర్శి బెల్లం శివయ్య, సీఐటీయూ మండల కన్వీనర్ వరికుప్పుల ముత్యాలు పాల్గొన్నారు.
నకిరేకల్, ఫిబ్రవరి 12: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్టీయూ, రైతుకూలీ సంఘం, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ, హమాలీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నకిరేకల్‌లో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిల్వేరు ప్రభాకర్, రైతుకూలీ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమరయ్య, రాష్ట్ర నాయకుడు పల్స యాదగిరి, బీసీపీ నాయకుడు బొల్లికొండ లింగయ్య, బీఎంఎస్ జిల్లా కన్వీనర్ చెట్టుపల్లి కాశీరాం, బీఎఫ్టీయూ నాయకుడు పోరెండ్ల సైదులు, సీఐటీయూ జిల్లా నాయకులు వంటెపాక వెంకటేశ్వర్లు, కందాల ప్రమీల, రాచకొండ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల, ఫిబ్రవరి 12: కార్మికులను బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేశ్ డిమాండ్ చేశారు. దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం చిట్యాలలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు అరూరి శ్రీను, మల్లం మహేశ్, దాడి అరుణ, ఫైళ్ళ పద్మ, ఏళ్ల మారయ్య, తిరుపతి, పాల లక్ష్మయ్య, జనపాల జ్యోతి, వడ్డేపల్లి శంకర్, సుక నర్సింహా, మంకాల బాలమ్మ, సిరిపంగి యాదయ్య, సీపీఎం మండల నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, నెలికంటి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.