హాలియా: ఉచిత వైద్య శిబిరంతో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుందని హాలియా సీఐ జనార్దన్ గౌడ్ అన్నారు. ఆదివారం హాలియా పట్టణంలోని ఆదిత్య కేర్ హాస్పిటల్ ఉచిత గుండె వైద్య శిబిరాన్ని(Free medical camp) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో గుండె జబ్బులు విపరీతంగా పెరిగాయని, హార్ట్ స్ట్రోక్ తో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. గుండెపోటు గురైన వెంటనే సీపీఆర్ ను చేయడం ద్వారా మనిషి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందన్నారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు.
వైద్య శిబిరంలో భాగంగా 500 మందికి బిఎంటి, షుగర్, బిపి, ఈసీజీ, వంటి పరీక్షలను ఉచితంగా చేశారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు మిట్టపల్లి కిరణ్, చీదల్ల లింగయ్య సహకారంతో రాగి జావా, పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆదిత్య కేర్ ఎండీ డాక్టర్ నులక రవీందర్ రెడ్డి, డాక్టర్లు రాఘవేందర్ రెడ్డి, పృధ్వీ రెడ్డి, హార్దిక్, పవన్ తేజ, ఇంద్రసేనారెడ్డి, పాల్వాయి వెంకటరెడ్డి, కే.రవీందర్ రెడ్డి, బి. ఎల్ ఎన్ రెడ్డి, చెన్ను వీరారెడ్డి, రిక్కల ధనుంజయ రెడ్డి, చెన్ను నర్సిరెడ్డి, నులక వెంకట్ రెడ్డి, చీదల్ల లింగయ్య చిట్టిపోలు సురేందర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.