చిట్యాల, ఫిబ్రవరి 04 : చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. బుధవారం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పట్టణంలోని 3, 5, 6వ వార్డుల్లోని ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చిట్యాల మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధిని ఓటర్లకు వివరిస్తూ ఆయా వార్డుల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను అందజేస్తూ ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. బీఆర్ఎస్ ని గెలిపిస్తేనే అభ్యర్థులు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు.

Municipal Elections : చిట్యాల మున్సిపాలిటీలో చిరుమర్తి లింగయ్య ముమ్మర ప్రచారం
అధికారంలోకి వచ్చి రెండేళ్లుగా కనిపించని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎన్నికలు అనగానే ఇప్పుడు హడావుడి చేస్తూ తమ అభ్యర్థులను గెలిపించాలని తిరుగుతున్నారన్నారు. కానీ వారిని గెలిపించిన వెంటనే మళ్లీ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతారని, ఎన్నికలప్పుడు మాత్రమే వారికి ప్రజలు గుర్తుకు వస్తారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులు చిత్రబోయిన సమత శ్రీకాంత్, జడల సంతోషి, ఆది మల్లయ్య, శేపూరి జయమ్మరవీందర్, తదితరులు పాల్గొన్నారు.

Municipal Elections : చిట్యాల మున్సిపాలిటీలో చిరుమర్తి లింగయ్య ముమ్మర ప్రచారం