బాల్య వివాహాలను అరికట్టాలి : సర్పంచ్ నరేశ్
బాల్య వివాహాలను అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల, కలెర్మ సర్పంచులు గుల్లి నరేశ్, తోటకూరి జలజ అన్నారు. గురువారం ఆయా గ్రామాల్లోని పాఠశాలలో ఐసీడీఎస్, బాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కట్టంగూర్, మార్చి 26 : బాల్య వివాహాలను అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల, కలెర్మ సర్పంచులు గుల్లి నరేశ్, తోటకూరి జలజ అన్నారు. గురువారం ఆయా గ్రామాల్లోని పాఠశాలలో ఐసీడీఎస్, బాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల బాలికలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని తెలిపారు. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి పిల్లల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బాలలకు ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు కాల్ చేయాలన్నారు. అనంతరం బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ పద్మావతి, పరిరక్షణ కమిటీ సిబ్బంది రేవతి, అశ్విని, ఎన్జీఓ ఝూన్సీ, అంగన్వాడీ టీచర్లు ఉబ్బని రామలింగమ్మ, ఊటూరి సైదమ్మ, గడ్డం జానకమ్మ, సరస్వతి, శోభారాణి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

