నార్కట్పల్లి, ఫిబ్రవరి 15 : చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆర్డీఓ రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. దేవాలయ ఈఓ కార్యాలయంలో గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మంచినీరు, మరుగుదొడ్ల వసతులు కల్పించాలని సూచించారు.
చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను శుక్రవారం ఉదయం 9గంటలకు గణపతి పూజతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రారంభిస్తారని ఆలయ ఈఓ నవీన్ తెలిపారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.