చండూరు, సెప్టెంబర్ 03 : చండూరు రెవెన్యూ డివిజన్ యూనిట్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. ముఖ్య అతిథులుగా టీఎన్జీవోస్, టీజేఏసీ చైర్మన్ నాగిళ్ల మురళి, కార్యదర్శి జై శేఖర్ రెడ్డి, హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రణదేవ్, కార్యదర్శి సత్యనారాయణ, చండూరు యూనిట్ అధ్యక్షుడు జి.లింగయ్య, కొండమల్లేపల్లి అధ్యక్షుడు కె.మనోజ్ ప్రదీప్ హాజరై హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ రెవెన్యూ డివిజన్ చండూర్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎం.వెంకన్న, కార్యదర్శిగా ఏ.సతీశ్ రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఆర్.అక్షిత, జాయింట్ సెక్రటరీగా ఆర్.జయరాం ఎన్నికయ్యారు. అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీదేవిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా జాయింట్ సెక్రెటరీ డి.సైదులు నాయక్, వి.భాస్కర్, రామకృష్ణారెడ్డి, యాదగిరి, రమ్యశ్రీ పాల్గొన్నారు.