సూర్యాపేట టౌన్, జనవరి 18 : ఖమ్మంలో జరిగిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)పార్టీ తొలి బహిరంగ సభకు సూర్యాపేట నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాది వాహనాల్లో లక్షలాదిగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా రహదారుల వెంట జై బీఆర్ఎస్.. జై కేసీఆర్.. జై జగదీశ్‌రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ దేశ్‌కీ నేత కేసీఆర్ అంటూ సందడిగా వెళ్లారు. అన్ని ప్రాంతాల నుంచి గులాబీ ఫ్లెక్సీలు, గులాబీ జెండాలతో వాహనాలను అలంకరించడంతో వీధులన్నీ గులాబీమయంగా మారాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివెళ్లారు.
సూర్యాపేట రూరల్ : మండలం నుంచి సభకు తరలిన వారిలో ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్‌నాయుడు, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు గౌని లక్ష్మణ్, మహేశ్, శ్రీనివాస్‌నాయుడు, నాయకులు రాఘవరెడ్డి, మాతృనాయక్ ఉన్నారు.
గరిడేపల్లి నుంచి..
గరిడేపల్లి : మండల కేంద్రంలో ఎంపీపీ పెండెం సుజాతాశ్రీనివాస్గౌడ్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. హుజూర్నగర్ ఏఎంసీ చైర్మన్ కడియం వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లారు. మండలం నుంచి 50 వాహనాల్లో 5 వేల మందితో తరలివెళ్లినట్లు పార్టీ మండలాధ్యక్షుడు కృష్ణానాయక్ తెలిపారు.
పెన్‌పహాడ్ నుంచి&
పెన్‌పహాడ్ : మండలం నుంచి సభకు వెళ్లిన వారిలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేంధర్, నాయకులు వెన్న సీతారాంరెడ్డి, పరెడ్డి సీతారాంరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, ఇంద్రసేనారావు, గుర్రం అమృతారెడ్డి, బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, దంతాల వెంకటేశ్వర్లు, పొదిల నాగార్జున, చిట్టెపు నారాయణరెడ్డి, ఆవుల అంజయ్య, మిర్యాల వెంకటేశ్వర్లు, మహీంద్రరాజు, రఫీ, బొల్లెద్దు వినోద్, బొబ్బయ్య, కొండమీద గోవిందరావు, అనంతుల శ్రీనివాస్‌గౌడ్, వావిళ్ల రమేశ్, కమ్మంపాటి లింగయ్య, చిత్తరంజన్ ఉన్నారు.
ఆత్మకూర్.ఎస్ నుంచి..
ఆత్మకూర్.ఎస్ : మండల కేంద్రం నుంచి ఎంపీపీ మర్ల స్వర్ణలత, నాయకులు మర్ల చంద్రారెడ్డి, మండలాధ్యక్షుడు తూడి నర్సింహారావు, రాజేంద్రప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, బొల్లె జానయ్య, తంగెళ్ల వీరారెడ్డి, మిర్యాల వెంకట్‌రెడ్డి, సానబోయిన సుధాకర్, తంగెళ్ల మధుసూదన్‌రెడ్డి, బ్రహ్మం, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు ఉన్నారు.
తిరుమలగిరి నుంచి..
తిరుమలగిరి : మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు సభకు వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమం కేసీఆర్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. తరలినవారిలో మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తుంగతుర్తి నుంచి..
తుంగతుర్తి : బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆధ్వర్యంలో 50 వాహనాల్లో సభకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రజలంతా మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమలో డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్, వైస్ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, ఎంపీటీసీ చెరకు సృజనాపరమేశ్, కటకం వెంకటేశ్వర్లు, తడకమళ్ల రవికుమార్, మల్లెపాక వెంకన్న, బొంకూరి విమల, జలంధర్, గోపగాని శ్రీనివాస్‌గౌడ్, గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేశ్‌గౌడ్, ముత్యాల వెంకన్న, సర్పంచులు అబ్బగాని పద్మాసత్యనారాయణగౌడ్, నల్లు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి లతారెడ్డి, చందా వెంకన్న, ఏశమల్ల సుశీల, సృజన్, మల్యాల రాములు, వెంకటనర్సయ్య, మల్లయ్య, రవి పాల్గొన్నారు.
నాగారం నుంచి&
నాగారం : బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య ఆధ్వర్యంలో ఖమ్మం సభకు భారీగా తరలివెళ్లారు. తరలిన వారిలో బీఆర్ఎస్ నాయకులు ఎర్ర యాదగిరి, చిల్లర చంద్రమౌళి, ఎంపీటీసీ వడ్డె పరశురాములు, ఈదుల కిరణ్‌కుమార్, వేణుగోపాల్‌రెడ్డి, ముకుందరెడ్డి, శ్రీనివాస్, మహేశ్, వెంకన్న, యాదగిరి, శేకర్‌రెడ్డి, చిరంజీవి, నరసింహారెడ్డి, సైదులు, పవన్, లింగయ్య, దొడ్డి ప్రేమయ్య, రామ్మూర్తి, ప్రశాంత్, అంజయ్య, ఎల్లయ్య, రమేశ్, రవి ఉన్నారు.
నూతనకల్ నుంచి..
నూతనకల్ : బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య ఆధ్వర్యంలో తరలిన వారిలో ఎంపీపీ భూరెడ్డి కళావతీసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ కనకటి వెంకన్న, ఎంపీటీసీ పన్నాల రమామల్లారెడ్డి, వైస్‌ఎంపీపీ జక్కి పరమేశ్, తాడూరి లింగయ్య, బిక్కి బుచ్చయ్య, చూడి లింగారెడ్డి, పగిళ్ల వెంకట్‌రెడ్డి, బత్తుల సాయిల్‌గౌడ్, గాజుల తిరుమలరావు, పన్నాల సైదిరెడ్డి, బద్దం ప్రశాంత్‌రెడ్డి, బద్దం వెంకట్‌రెడ్డి, చురకంటి చంద్రారెడ్డి, అనంతుల వెంకన్న, మొగుళ్ల వెంకన్న , ఏర్పుల లింగయ్య, బత్తుల విజయ్‌కుమార్ ఉన్నారు.
అర్వపల్లి నుంచి..
అర్వపల్లి : మండలంలోని కుంచమర్తి నుంచి ఎంపీపీ మన్నె రేణుక, అర్వపల్లిలో జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్, కోడూరులో పార్టీ మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్గౌడ్, జాజిరెడ్డిగూడెంలో జిల్లా నాయకుడు మొరిశెట్టి ఉపేందర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు డీసీఎంలలో బయల్దేరారు. మండల వ్యాప్తంగా 22 డీసీఎంలు, 15కార్లలో 2వేల మంది తరలివెళ్లారు.