నల్లగొండ, జనవరి 2 : నల్లగొండలోని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గుత్తాకు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు పలువురు బొకేలు అందజేసి శాలువాలతో సతరించి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో జడ్పీ వైస్ చైర్మన్ పెద్దులు, కనగల్ ఎంపీపీ కరీం పాషా , జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, బీఆర్ఎస్ నాయకులు ఐతగోని స్వామి గౌడ్, గోపాల్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, హరికృష్ణ, పాదూరి ఇంద్రసేనారెడ్డి, రేగట్టె సైదులు, గుండె ర వి, పరమేశ్, జగిని వెంకన్న, శ్రీనివాస్ ఉన్నారు.