రామగిరి, జూన్ 6: ‘కేంద్ర, రాష్ట్ర ఫ్రభుత్వాల అనాలోచిత విధానాలతో తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ల్లో ఒకటి అర తప్ప మిగిలినవి పూర్తిస్థాయిల్లో అమలుకు నోచుకోవడం లేదు. రైతాంగ సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు, ఇతర సమస్యల పరిష్కారం అసంపూర్తిగానే ఉండటంతో ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతోంది. వీటిని నిరసిస్తూ ఈ నెల 10న నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆం దోళనకు పెద్ద ఎత్తున్న తరలి రావాలి’ అని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. నల్లగొండలోని సీపీఐ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ఫ్రభుత్వం ఐదు రాష్ర్టాల ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెం చి సామాన్యులపై పెనుభారం మోపిందన్నారు. అదా నీ, అంబానీలకు రూ.వేల కోట్ల రాయితీలు ఇస్తూ.. సామాన్యుల నడ్డి విరుస్తోందన్నారు. తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో బీజేపీ సర్కార్ విఫలమైందన్నారు. ధాన్యం కొనుగోలులో 6 కిలోల తరుగు తీస్తున్నారని చెప్పారు. నల్లగొండలోని ఎస్ఎల్బీసీ సోరంమార్గం, డిండి ఎత్తిపోతుల, ఉదయసముద్రం ప్రాజెక్టుల పనులు ముం దుకు సాగడం లేదన్నారు. సీఎం పవన్‌కల్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మాట్లాడుతూ రెచ్చగొట్టడం తగదన్నారు. సమావేశంలో ఉజ్జిని యాదగిరిరావు, పల్లా నర్సింహారెడ్డి, మల్లేపల్లి ఆదిరెడ్డి, పల్లా దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్, బంటు వెంకటేశ్వర్లు, బుచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, సైదిరెడ్డి పాల్గొన్నారు.