నీలగిరి, అక్టోబర్ 06 : నేరాల నియంత్రణలో సీసీ టీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ మండలం నర్సింగ్భట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలను సీఐ రాఘవరావు, రూరల్ ఎస్ఐ సైదాబాబుతో కలిసి ఆయన ప్రారoభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాలను నియంత్రించడానికి, నేరస్తుల గుర్తింపునకు, ప్రజల భద్రతను మెరుగు పరచడానికి సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ తమ ఇండ్లు, దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య, కానిస్టేబుల్ తిరుమలేష్, జెల్ల కోటిలింగం, ప్రొఫెసర్ శ్యాంసుందర్, తాజుద్దీన్, గుండు వెంకటేశం, పంతంగి లింగయ్య, బొమ్మగోని సత్యనారాయణ, గ్రామ కార్యదర్శి, బల్లెం ప్రవీణ్ కుమార్, గుండెబోయిన సైదులు, చామకూరి మహేశ్, కాసాని లింగస్వామి, ముక్కంలా శేఖర్, అంబటి సత్తయ్య, అంబటి అంజయ్య, మేఘనాథ్, సుధాకర్, మాధగోని సత్తయ్య, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.