నిడమనూరు, జూలై 20 : నిడమనూరు మండల పరిధిలోని వెనిగండ్ల గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడవల్లి వల్లభ రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ పల్లెల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుందన్నారు. సీసీ రోడ్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింగ్ విజయ్ కుమార్ గౌడ్, సర్పంచ్ వట్టె లింగమ్మ, నాయకులు కొండ శ్రీనివాస్ రెడ్డి, ముంగి శివ మారయ్య, పోలె డేవిడ్, ఉన్నం సత్యనారాయణ, కొప్పోలు స్వర్ణలత, వట్టె మహేష్, పోలే రవి, సుధాకర్, పాండురంగయ్య, చల్లా తిరుమల్ యాదవ్, గాదె సత్యనారాయణ, చింతమల్ల సాంబయ్య, శ్రీకాంత్, విజయ్ పాల్గొన్నారు.