‘గాలికుంటు వ్యాధి టీకాలతో పశువులను సంరక్షించుకోవాలి’
గాలికుంటు వ్యాధి టీకాలతో పశువులను సంరక్షించుకోవాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో..
కోదాడ, మార్చి 24 : గాలికుంటు వ్యాధి టీకాలతో పశువులను సంరక్షించుకోవాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో టీకా జిల్లా ప్రచార రథాన్ని వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ వ్యాధిపై పాడి రైతులకు అవగాహన కలిగించేందుకు రథం ఏర్పాటు చేయబడిందని తెలిపారు. గాలికుంటు టీకా కార్యక్రమం గ్రామ గ్రామాన పశు పోషకులకు ఉపకరిస్తుందన్నారు.. ఇక్కడి వైద్యులు మూగ జీవాలకు సకాలంలో చికిత్సను అందించడం మంచి పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బోడపూడి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తిరుపతమ్మ, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మల్లీశ్వరి, అసిస్టెంట్ డైరెక్టర్ పెంటయ్య, కౌన్సిలర్ నాగేంద్రమ్మ, న్యాయవాది కే ఎల్ ఎన్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

