మిర్యాలగూడ టౌన్, జూన్1 : గతంలో ఆరోగ్యపరంగా ఏ సమస్య ఉన్నా హైదరాబాద్‌తోపాటు ఇతర పట్టణాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఒక్కోసారి అత్యవసర వైద్య సేవలకు హైదరాబాద్‌లోని హాస్పిటల్స్‌కు వెళ్తే మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఎలాంటి అత్యవసర వైద్య సేవలకైనా జిల్లాలోని మిర్యాలగూడ పట్టణం కేరాఫ్‌గా మారింది.
హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా అత్యాధునిక వైద్య పరికరాలు, 24 గంటల వైద్య సేవలు, ఐసీయూ, క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ, ఎంఆర్ఐ, సీటీస్కాన్ సదుపాయాలు ఇక్కడి హాస్పిటల్స్‌లో లభిస్తున్నాయి. అరుదైన శస్త్ర చికిత్సలు సైతం మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో జరుగుతున్నాయి. న్యూరో, గుండె చికిత్సలు, ఆర్థోపెడిక్ తదితర అన్ని రకాల వైద్యసేవలు అందుతున్నాయి.