శాలిగౌరారం, జూన్ 16 : ఎడ్ల బండిని వెనక నుండి వచ్చిన కారు ఢీకొట్టిన దుర్ఘటనలో రెండు కాడెడ్లు మృతి చెందిన ఘటన శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెర్క కొండారం గ్రామానికి చెందిన బండారు రామ్మూర్తి ఎడ్ల బండిని తోలుకొని గ్రామ శివారులోని నేషనల్ హైవే రోడ్డుపై బయల్దేరాడు. అదే రూట్లో వెళ్తున్న కారు నకిరేకల్ నుండి పెర్క కొండారం మీదుగా అర్వపల్లి వైపు వెళ్తూ ప్రమాదవశాత్తు వెనుక నుండి ఎడ్ల బండిని ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కాడేడ్లు అక్కడికక్కడే మృతి చెందాయి. ఎడ్ల బండి తోలుతున్న రైతు రామ్మూర్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.రెండు లక్షలు నష్టం వాటినట్టు తెలిపారు.