– వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య
కనగల్, ఏప్రిల్ 16 : ఉపాధి హామీలో రెండు పూటలా ఫొటో క్యాప్చర్ విధానం తీసి వేయాలని, ఈ నెల 21 నుండి మండలాల ముందు జరుగు ధర్నాలో ఉపాధి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య పిలుపునిచ్చారు. గురువారం కనగల్ మండలంలోని లింగోటం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నోసంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు పనైనా చూపండి, తిండి అయినా పెట్టండి అనే నినాదంతో పోరాటాలు నిర్వహించిన ఫలితంగా 2005లో యూపీఏ-1 ప్రభుత్వంలో వామపక్ష పార్టీల ఒత్తిడి ఫలితంగా ఉపాధి హామీ సాధిస్తే 2014 నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీకి రోజురోజు బడ్జెట్లో కోతలు విధిస్తూ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి చర్యలకు మోదీ ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు.
కోట్లాది మంది ఉపాధి కార్మికుల బ్రతుకులను అపహాస్యం చేసేటటువంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదని ఉపాధి హామీ పనిచేస్తే అనేక రకాలైన ఆంక్షలు కూలీలపై పెడుతూ పోద్దస్తమానం పనిచేస్తే రూ.100 నుండి 150 కు కూడా కూలి గిట్టుబాటు కావడంలేదని ఒకవైపు నిత్యవసర వస్తువుల ధరలను పెంచుతూ కోట్లాదిమంది ప్రజల పై ఆర్థిక భారాలు మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంలోకి యంత్రాలు రావడంతో కార్మికులకు పనులు పూర్తిగా తగ్గిపోయాయని గ్రామాల్లో పనులు లేక అనేకమంది పేదలు పొట్ట చేత పట్టుకొని వలస బాట పడుతున్నారని తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షలకు పైగా జాబ్ కార్డులు ఉన్నాయని, కోటి 20 లక్షల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారని ఇందులో 10 శాతం మందికి కూడా పనులు చూపించలేకపోతున్నారని అందరికీ పని కల్పించే పద్ధతులు చర్యలు చేపట్టాలని, కొత్తగా తెచ్చిన విపిజి రాంజీ బిల్లును వెనక్కి తీసుకొని ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చట్టాన్ని అమలు చేసినటువంటి బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని రాష్ట్రాల పైకి నెట్టి కార్మికులకు ఉపాధి దూరం చేయొద్దని కోరారు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ దేశంలోనే అణగారిన వర్గాలు ఒక పూట తిండి తిని మరో పూట పస్తులు ఉన్నటువంటి ప్రజానీకం పట్ల వారికి ఉన్నటువంటి సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయకుండా కులం మతం రంగులు మారుస్తూ ప్రజల మధ్య అనేక వైశాల్యాలను ఎంచి పోషిస్తూ తన పరిపాలనను కొనసాగిస్తుందని ఇలాంటి దుర్మార్గాలు మరెన్నో రోజులు సాగవని తెలిపారు. జిల్లాలో ఉపాధి హామీ పనులు నత్త నడకన జరుగుతున్నాయని అధికార యంత్రాంగం ఉపాధి హామీ పనుల పట్ల పూర్తి శ్రద్ధ వహించి జిల్లాలోని కార్మికులందరికీ పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని 125 రోజుల నుండి 200 రోజులకు పని దినాలను పెంచాలని పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు అనుకూలంగా రోజు కూలి 800 ఇవ్వాలని అట్లాగే మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ పేదలందరికీ ఉపాధి హామీ ద్వారా పని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21 నుండి 25 వరకు మండలాల ముందు జరుగు ధర్నాలో కార్మికులంతా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ దుర్గయ్య ఉపాధి కార్మికుల సంఘం గ్రామ అధ్యక్షుడు ఓర్సు పెద్దూలు కార్యదర్శి మట్టిపల్లి మౌనిక, సంఘ నాయకులు దాసరి లక్ష్మమ్మ. కోరే యాదమ్మ, దాసరి మహేష్, మట్టిపల్లి పాపమ్మ పైళ్ల సుధాకర్, నర్సింగ్ లక్ష్మమ్మ, కోరే వినోద, గునాలపూరి అలివేలు, ఆదిమల్ల యాదమ్మ, చెరుకుపల్లి మమత, మట్టిపల్లి వెంకటమ్మ, పైల్లా శీను పాల్గొన్నారు.