నీలగిరి,ఆగస్టు 14: నల్లగొండ పట్టణంలో గం జాయి సేవిస్తూ, విక్రయిస్తున్న పది మంది యు వకులను ఆరెస్టు చేసి వారి నుంచి 1.65 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి తెలిపారు. గురువా రం నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుధవారం సాయంత్రం మునుగోడు రోడ్డులో గంజాయి తాగుతున్న ఆరుగురు యవకులను ఆదుపులోకి తీసుకుని వారిని పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. అలాగే మిర్యాలగూడ రోడ్డులోని జూబ్లీహిల్స్‌లో గంజాయి అమ్ముతున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
స్థానిక హౌసింగ్ బోర్టు సమీపంలో మెగలిపాక నూతన్‌కుమార్, మహ్మ ద్ అసద్, దింగన్ ఆకాశ్, బేద్ లక్కీ సుందర్, మహ్మద్ అజ్మల్ గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం రావడంతో వన్‌టౌన్ ఎస్సై గోపాల్‌రావు ఆధ్వర్యంలో పట్టుకున్నట్లు తెలిపారు. ఆదేవిధం గా జూబ్ల్లీహిల్స్ ప్రాంతంలో మహ్మద్ ఇమ్రాన్, పోలిశెట్టి వెంకటేశ్, నలుపరాజు శివ, చిత్ర రమే శ్ గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రా వడంతో వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యం లో పట్టుకున్నట్లు తెలిపారు. ఇరువురు నిందితుల నుంచి 1.65 కేజీల గంజాయిని స్వాధీ నం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
మాదకద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి, ఉకుపాదంతో అణిచివేస్తామని, ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదన్నారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, గంజాయి సరఫరా, విక్రయించే వారిపైనే కాకుండా, సేవించే వ్యక్తులపై కూడా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గంజాయి, మాదకద్రవ్యాలను సరఫ రా చేసేవారి గురించి సమాచారం తెలిస్తే వెంట నే, డయల్ 100, డయల్ 8712670141 ద్వా రా కానీ లేదా నేరుగా సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో నల్గొండ వన్‌టౌన్ సీఐ వేమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై గోపాల్ రావు, సతీష్, ఏఎస్సైలు వెంకటయ్య, వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ రబ్బాని, కానిస్టేబుల్ షకీల్, శ్రీకాంత్, శం కర్, ఆంజనేయులు, లేడీ కానిస్టేబుల్ రమాదేవి, మహేశ్వరి, హోంగార్డులు సైదులు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.