కోదాడ, ఏప్రిల్ 24 : ఈ నెల 22న జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్‌లో ఉగ్రవాదులు నరమేదానికి పాల్పడి 26 మంది పర్యాటకులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిని నిరసిస్తూ గురువారం కోదాడ పట్టణంలో ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
బస్టాండ్ వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పందిరి నాగిరెడ్డి, బడుగుల సైదులు, పంది తిరపయ్య, ముత్తవరపు రామారావు, హరికిషన్, సలీం షరీఫ్, నరసింహారావు, ఉదయగిరి, ఖాజామియా, జానకిరామ్, బాబు, జి ఎల్ ఎన్ రెడ్డి, గోదేశీ రామారావు, రామ నరసయ్య పాల్గొన్నారు.