దేవరకొండ రూరల్, జూన్ 14 : బస్ పాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. చార్జీలు, బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపిందన్నారు. బస్ పాస్ ధరల పెంపు విద్యార్థులుపై తీవ్ర ఆర్థిక ప్రభావం చూపనుందన్నారు. కాంగ్రెస్ సర్కార్కు ఖజానా నింపుకునేందుకు విద్యార్థులే దొరికారా అని ఆయన ప్రశ్నించారు.