కట్టంగూర్, ఆగస్టు 14 : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామ మాజీ సర్పంచ్ బూరుగు అంజయ్య 22వ వర్ధంతిని ఈదులూరు గ్రామంలో గురువారం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు అంజయ్య విగ్రహానికి పూల మాలలువేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు ఇందూరు సాగర్, మాజీ సర్పంచ్ ఐతగోని నారాయణ, బూరుగు సత్తయ్య, బొంగరాల నర్సింహ్మ, నగేశ్, ఉపేందర్, వెంకటేశ్వర్లు, బీవీ చారి, బండారు వెంకన్న, సిలువేరు జానయ్య, రావుల లింగయ్య, వేముల శంకర్, బూరుగు లక్ష్మమ్మ, పార్వతమ్మ, వెంకన్న, జానపాటి దేవయ్య, పెరక శారద, లింగయ్య పాల్గొన్నారు.