నీలగిరి, జూన్ 8: కాంట్రాక్టర్ల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం కోసం ఈనెల 18న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బా య్) జాతీయ నాయకుడు ఎస్ఎన్ రెడ్డి, డీవీఎన్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం వెంకట్మ్రణ హోటల్లో చలో హైదరాబాద్కు సంబంధించిన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాయ్ జాతీ య ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి మాట్లాడుతూ 2017 వరకు మూడేండ్ల పాటు ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ నిర్వహించి అనంతరం ఎత్తి వేశారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ సీరియల్ విధానం పాటిస్తారని ఆశించామని కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు బిల్లులు చెల్లిస్తోందని, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీరియల్ ప్రకారం బిల్లులు ఇవ్వాలనన్నారు. బిల్లులు రాక ఎంతో మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారిలో ధైర్యం నింపేందుకు ఈ కార్యక్రమం చేపడతున్నట్లు తెలిపారు. రాష్ట్రం లో సుమారు రూ.20 వేల కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయని, ఇచ్చే పేమెంట్స్ సీరియల్ ప్రకారం ఇవ్వాలన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకుంటే ఆ ప్రకారమే పనులు చేపట్టాలని కోరారు. నాగర్కర్నూల్లో మూడు నెలల కిందట శ్రీనివాస రెడ్డి అనే కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయనకు సుమారు రూ.10 కోట్ల బిల్లులు రావాలని ఇప్పటికీ ఆ బిల్లు మంజూరు కాలేదన్నారు. బాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు ఎన్ఎన్రెడ్డి మాట్లాడుతూ ఆప్ఘనిస్తాన్లో వర్స్ చేయొచ్చు కానీ ఇండియాలో చేయలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకడ ప్రభుత్వాలు మానసికంగా చంపుతున్నాయన్నారు. 98 శాతం కాం ట్రాక్టర్లు పనుల కోసం ఆస్తులు తాకట్టు పెట్టుకున్నారన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేదనే కారణంతో తమ బిల్లులు నిలిపివేయవద్దన్నారు. సమావేశంలో సీహెచ్ శ్రీనివాసరావు, సంతోష్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కృష్ణారావు తదితరులు ఉన్నారు.