నందికొండ, డిసెంబర్ 25 : నందికొండ హిల్‌కాలనీలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనం బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబించే శిల్పకళా నిలయం, తెలంగాణ పర్యాటక కేంద్రాల్లో ప్రముఖమైనదని రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. అఖిల భారత సర్జన్ల సంఘం పూర్వ కార్యదర్శి మధుశేఖర్‌తో కలసి ఆదివారం ఆయన బుద్ధవనాన్ని సందర్శించారు. వారికి బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. బుద్ధవనంలో బుద్ధచరిత వనం, జాతక పార్కు, అవకాన బుద్ధ, స్తూప పార్కు, మహాస్తూప విశేషాలను బుద్ధవనం బౌద్ధ నిపుణుడు ఈమని శివినాగిరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా సచివాలయం ఉన్నతాధికారులను బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య శాలువాలతో ఘనంగా సన్మానించారు. వీరికి బుద్ధవనం విశేషాలను బుద్ధవనం ఓఎస్డీ సుధాన్‌రెడ్డి వివరించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా బుద్ధవనానికి పర్యాటకుల తాకిడి పెరిగింది.