దేశ, విదేశీ పర్యాటకులకు ఆకర్షణగా బుద్ధవనం
కృష్ణానది తీరాన పచ్చని వాతావరణంలో అంతర్జాతీయ బౌద్ధ వారసత్వ ప్రమాణాలతో నిర్మించిన బుద్ధవనం దేశ, విదేశీ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు అన్నారు.
- ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
నందికొండ, ఫిబ్రవరి 23 : కృష్ణానది తీరాన పచ్చని వాతావరణంలో అంతర్జాతీయ బౌద్ధ వారసత్వ ప్రమాణాలతో నిర్మించిన బుద్ధవనం దేశ, విదేశీ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు అన్నారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆహ్వానం మేరకు నందికొండ హిల్‌కాలనీలోని బుద్ధవనాన్ని గురువారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో నిర్మించిన బుద్ధవనం మానసిక ప్రశాంతతను కలిగిస్తున్నదన్నారు. వారాంతంలో విజయవాడ నుంచి నందికొండకు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. బుద్ధవనాన్ని గొప్పగా నిర్మించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్యకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ రోడ్డు రవాణా సంస్థ ఈడీ బ్రహ్మానందరెడ్డి, డీఎస్పీ జయరాంప్రసాద్, సీఐలు షమీముల్లా, బాలకృష్ణ, ఎస్ఐ అనిల్‌కుమార్, నరిసింహారావు, విష్ణు ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

