నాగారం, డిసెంబర్ 7 : సూర్యాపేట ఎమ్మెల్యేగా మరోమారు విజయం సాధించిన గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని బీఆర్ఎస్ నాగారం మండల నాయకులు గురువారం మండల కేంద్రంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలోని ఆయన ఇంట్లో కలిసి స్వీట్లు తినిపించి శాలువాతో సత్కరించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ గుండగాని అంబయ్యగౌడ్, అధికార ప్రతినిధి చిల్లర చంద్రమౌలి, పొదిల రమేశ్, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ఈదుల కిరణ్‌కుమార్, నాయకులు కూర వెంకన్న, మంచినీళ్ల మహేందర్, చిప్పలపల్లి మల్లేశ్, ఉపేందర్, బడేసాబ్, మధు, గ్రామస్తులు పాల్గొన్నారు