నల్లగొండ సిటీ, ఏప్రిల్ 10 : నల్లగొండలో సమ్మె చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు శుక్రవారం బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలన్నారు. ఆర్టిజన్ల అర్హతను బట్టి APSEB సర్వీస్ రూల్స్ ప్రకారం కన్వర్షన్ చేసి క్రమబద్ధీకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్ రెడ్డి, ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు.