త్రిపురారం, జులై 09 : నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్వీ నాయకులు తిరిగి సొంత గూటికి చేరారు. వారికి ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బుధవారం త్రిపురారం మండల కేంద్రంలోని అనుముల శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులకు ఎమ్మెల్సీ కోటిరెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మాయమాటలకు, ప్రలోభాలకు లోనై పార్టీని వీడిన విద్యార్థి నాయకులు తిరిగి రావడం ఆనందంగా ఉందన్నారు. పార్టీ పటిష్టతకు పునాదిరాళ్లు యువతే అన్నారు. ఎల్లవేళలా వారికి అండగా ఉంటారన్నారు. కార్యక్రమంలో అనుముల శ్రీనివాస్‌రెడ్డి, పామోజు వెంకటాచారి, ఖాసీం, చింతకాయల యాదయ్య, కలకొండ వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు ఏళ్ల మహేందర్‌రెడ్డి, కట్టా విక్రమ్, బంటు రాము, నక్క శ్రీధర్, రాచూరి రుషి, సతీశ్, సిద్దు పాల్గొన్నారు.