మాల్, సెప్టెంబర్ 12 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండలం బొత్యతండా, రెడ్యాతండా, గుడితండా, జాగ్యతండా, కొర్రమనిసింగ్తండాల్లోని కాంగ్రెస్, బీజేపీకి చెందిన 100 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులయ్యే ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారన్నారు. ప్రతి కార్యకర్త కుంటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
సమైక్య పాలనలో దశాబ్దాలుగా అణచివేతకు, వెనుకబాటుకు గురైన గిరిజనులు నేడు ఆత్మగౌరవంతో బతుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్‌రెడ్డి, మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు రాజవర్ధన్‌రెడ్డి, చింతకుంట్ల విజయ్ పాల్గొన్నారు.