– విజయవంతం చేయాలని కార్యకర్తలకు ఆ పార్టీ అర్వపల్లి నాయకుడు సోమేశ్ గౌడ్ పిలుపు
అర్వపల్లి, జూన్ 13 : బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజకవర్గ సమావేశం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన ఈ నెల 15న జరుగనున్నట్లు ఆ పార్టీ అర్వపల్లి మండల నాయకుడు గుండగాని సోమేశ్ గౌడ్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం అర్వపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం జరిగే సమావేశానికి ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, పార్టీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, నియోజకవర్గ సభ్యత్వ ఇన్చార్జి ఎలగందుల వెంకటేశ్వర్లు హాజరు కానున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజవంతం చేయాలని ఆయన కోరారు.