మునుగోడు, ఏప్రిల్ 15 : వరంగల్లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజితోత్సవ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ మునుగోడు మండల కార్యదర్శి పగిల సతీశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం సభకు సంబంధించిన వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని ఆయన మండలంలోని చలిమెడ గ్రామంలో ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రజలు నేడు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చి సభను విజయవంతం చేయనున్నట్లు తెలిపారు.