దేవరకొండ, డిసెంబర్ 04 : కాంగ్రెస్ వైఫల్యాలు, కేసీఆర్ పాలన అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో చింతపల్లి మండలంలోని తక్కల్లపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచే విధంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. గత రెండేళ్ల పాలల్లో కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీటీసీ శ్రీశైలం, వెంకటయ్య, తదితరులు ఉన్నారు.