అర్వపల్లి, ఏప్రిల్ 24 : ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలిరావాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కోమటిపల్లి, అడివేంల, కొమ్మాల, నాణ్యతండాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాడూరి రామకోటి, చిర్రబోయిన వెంకన్న, నున్న యాదగిరి, సుందర్ నాయక్, గడ్డం వెంకన్న, నాగు, మల్లేశ్, తిరుమల్, ప్రవీణ్, మల్సుర్, కృష్ణ, ఉపేందర్, సాయిబాబు, సైదులు, మల్లయ్య, భిక్షం, వెంకటయ్య, వెంకన్న, వంశీ, లింగస్వామి పాల్గొన్నారు.