హాలియా,జనవరి 18 : ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఆర్టీసీ బస్సులు, డీసీఎం, లారీలతో పాటు సొంత వాహనాల్లో వెళ్లారు. వారి వాహనాలను పార్టీ బాధ్యులు జెండా ఊపి ప్రారంభించారు. హాలియాలో వాహన ర్యాలీని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సాదం సంపత్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మున్సినల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు జవ్వాజి వెంకటేశం, మర్ల చంద్రారెడ్డి, నిడమనూర్ ఎంపీపీ బొల్లం జయమ్మ, పెద్దవూర జడ్పీటీసీ అభ్బిడి కృష్ణారెడ్డి, పార్టీ జిల్లా నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి, ఆవులదొడ్డి రాహుల్, మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణాధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, నాయకులు ఎన్నమల్ల సత్యం, దోరేపల్లి వెంకన్న, పోశం శ్రీనివాస్ గౌడ్, ఉడ్తూరి శ్రీనివాస్‌రెడ్డి, సురభి రాంబాబు, కౌన్సిలర్లు నల్లబోతు వెంకటయ్య, ప్రసాద్‌నాయక్, శ్రీనివాస్, కోప్షన్ సభ్యులు రావుల లింగయ్య, చాపల సైదులు, నాయకులు పాల్గొన్నారు.