మునుగోడు, ఏప్రిల్ 11 : ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం బీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కావస్తున్న శుభ సందర్భంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. కావునా పార్టీ శ్రేణులు కనీవిని ఎరుగని రీతిలో మహాసభను విజయవంతం చేయాలన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 15 నెలలు గడిచినా హామీల అమలుకు పూనుకోకపోవడం, ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై సింహ గర్జన పూరించే విధంగా కేసీఆర్ భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు.
Mudugode : బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలి : కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని రానున్న రోజుల్లో అధికారం మళ్లీ తమదేనని ధీమా వ్యక్తం చేశారు. సన్నబియ్యం ముసుగులో ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మోసం చేస్తుందన్నారు. సాధారణంగా మిల్లర్లు బియ్యంలో 5 శాతం నూకలు కలుపుతారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 25 శాతం నూకలు కలపడానికి అనుమతి ఇచ్చిందన్నారు. మిల్లర్లు దొరికిందే అదునుగా 35 శాతం నూకలు కలిపి మోసాలకు తెరలేపుతున్నట్లు చెప్పారు. ప్రజలు రేవంత్ రెడ్డి మోసాలు గుర్తిస్తున్నరని సరైన సమయంలో బుద్ది చెప్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి, మండల పార్టీ నాయకులు, అన్ని గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Mudugode : బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలి : కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి