నందికొండ, ఫిబ్రవరి 8 : యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్‌లో ఎటువంటి అభివృద్ధి చేయని కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు లేదని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నందికొండ మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థ్ధులు 1వ వార్డులో శ్రావణి, 2వ వార్డులో ఘని, 3వ వార్డులలో హర్ష, 4వ వార్డులో యల్ అన్నపూర్ణ, 5వ వార్డులో పెద్దయ్య, 6వ వార్డులో సపావత్ చంద్రమౌళి, 7 వార్డులో సయ్యద్ షాహిదాబేగం, 8వ వార్డులో నకిరెకంటి రమణ, 9వ వార్డులో బత్తుల శేఖర్‌బాబు, 10 వార్డులో కోడ సరోజ, 11వ వార్డులో హిరేకార్ రమేశ్‌జీ, 12వ వార్డులో ఎర్ర మంజుశ్రీలతో కలసి ఆదివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ఇన్చార్జ్, సూర్యాపేట మాజీ జెడ్పీ చైర్మన్ గుజ్జ యుగేంధర్‌రావు, మాజీ ఎంపీపీ చెన్ను సుందర్‌రెడ్డి, మక్సూద్, గౌస్, నజీర్, మన్సూర్, శేఖరాచారి, జనార్ధన్‌రెడ్డి, ముడావత్ లక్ష్మణ్‌నాయక్, కోదండం, రఫీ, శివ, రవి, అర్జున్, బీమ్బహుదుర్, రామ్చంద్రారెడ్డి, వర్షిత్, వెంకట్, సాయి పాల్గొన్నారు.
17వ డివిజన్లో ప్రచారం
నీలగిరి,ఫిబ్రవరి 8: నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని ఆర్జాలబావి డివిజన్లో 17వ డివిజన్ అభ్యర్థ్ధి మందడి లిఖిత సైదిరెడ్డి అదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నల్లగొండ పట్టణ అభివృద్ధ్దికి పాటుపడిన బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి గెలిచారని, ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలో గెలిపించినా అదే పునరావృత్తం చేస్తారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ప్రచారంలో బీఆర్ఎస్, సీపీఎం నాయకులు కోట్ల అశోక్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, గోవింద్‌రెడ్డి, మర్రి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు అన్వర్ పాష పాల్గొన్నారు.

గెలిపిస్తే ఫంక్షన్ హాల్ ఉచితం
చిట్యాల, ఫిబ్రవరి 8: తనను కౌన్సిలర్‌గా గెలిపిస్తే వార్డు ప్రజలకు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు తన ఫంక్షన్ హాల్ ఉచితంగా ఇస్తానని 11వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నిమ్మనగోటి శ్రీను హామీ ఇచ్చారు. ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఫంక్షన్ హాల్‌ను ఉచితంగా ఇవ్వటమే కాకుండా ఆడపిల్లలు పుడితే రూ. 5116, తన ఫంక్షన్ హాల్లో కాకుండా మరో ఫంక్షన్ హాల్లో ఆడపిల్లల పెళ్లి చేస్తే రూ.10116లు ఉచితంగా అందజేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో వార్డు ఇన్చార్జిలు కొలను వెంకటేష్, గుండమళ్ల పురుషోత్తం, మేడి ఉపేందర్, ఉస్కిళ్ల నాగరాజు, గూడ అఖిల్, బొడ్డుపల్లి వెంకటేష్, ఉపేందర్, ప్రవీన్, యశ్వంత్, దగ్గుల సైదులు, శంకర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలి
మిర్యాలగూడ, ఫిబ్రవరి 8: కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్దార్ధ పిలుపునిచ్చారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 1, 4, 13, 14, 20 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటు కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డు చూపించి నిలదీయాలన్నారు. 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ‘కారు’ గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓటర్లకు కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణి చేసి చైతన్యపరచాలని అభ్యర్థ్ధులకు సూచించారు. మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు.
‘కారు’ గుర్తుకు ఓటేసి గెలిపించండి
నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 8: ఈనెల 11 జరిగే నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 47వ డివిజన్లో ‘కారు’ గుర్తుకు ఓటేసి గెలిపించాలని, డివిజన్ పరిధిలోని విద్యానగర్, సతీష్ నగర్, బోయవాడ తదితర కాలనీలను అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి సింగం లక్ష్మీ రామ్మోహన్ అన్నారు. ఆదివారం ఆమె డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ‘కారు’ గుర్తుకు ఓటువేసి తనను గెలిపిస్తే డివిజన్ పరిధిలోని ప్రజల అవసరాలకు ఉచితంగా ఫంక్షన్ హాల్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మహిళలు స్వశక్తితో ఆర్థికంగా అభివృద్ధ్ది చెందేలా వారికి కుట్టు మిషన్, బ్యూటీషియన్ వంటి వాటిల్లో ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నామని తెలిపారు. డివిజన్ లో సీసీ రోడ్ల నిర్మాణం, డైనేజీ, కమ్యూనిటీ భవన నిర్మాణాలు చేపడుతామన్నారు. కేసీఆర్ పాలనలో, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సహకారంతోనే నల్లగొండ అభివృద్ధి చెందిందని, బీఆర్ఎస్ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటా
చండూరు, ఫిబ్రవరి 8: రేయింబవళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటానని బీఆర్ఎస్ 2వ వార్డు అభ్యర్థ్ధి అన్నెపర్తి శేఖర్ అన్నారు. చండూరు మున్సిపాలిటీలోని 2 వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న అన్నెపర్తి శేఖర్ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో చండూరు అభివృద్ధి చెందిందన్నారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ ఆపద వచ్చినా మీముందు ఉంటానని 11న జరిగే ఎన్నికల్లో ‘కారు’ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థ్దించారు.

Nalgonda