నేరేడుచర్ల, జూలై 23:అధికారం చేపట్టిన నాటి నుం చి ఇందిరమ్మ రాజ్యం, పేదల ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న సీఎం, మంత్రులు, ఎమ్మె ల్యేలు పేదలపై పోలీసులతో విచక్షణారహితంగా దాడులు చేయించడం సరికాదని బీఆర్ఎస్ హుజూ ర్‌నగర్ నియోజవకర్గ సమన్వయ కర్త ఒంటెద్దు నర్సింహా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పోలీస్ చేతిలో చావు దెబ్బలు తిన్న బాధితులు సంకలబుడ్డి శీనయ్యయాదవ్, అతడి భార్య కళమ్మ, కుమారుడు నవీన్‌యాదవ్ బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయించగా వారిని చూసి చలించిపోయిన బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ పెద్దల దృష్టికి తీసుకవెళ్లడంతో వారికి అండగా నిలవాలని పార్టీ ఆదేశించింది.
దీంతో బుధవారం వారిని పరామర్శించిన సందర్భంగా నేరేడుచర్ల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకొని విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి వారిని నడవలేని విధంగా విచక్షణారహితంగా దాడి చేయడంపై బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని, నేరేడుచర్ల ఎస్ఐను వెంటనే సస్పెం డ్ చేయడంతోపాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేదలవైపు ఉంటారా లేక నిత్యం పార్టీలు మారి ప్రజలను మోసం చేసేవారివైపు ఉంటారో బహిరంగంగా తెలపాలని కోరారు. మండలంలోని కల్లూరు శివారులోని 86 సర్వేనెంబర్‌లోని భూమిలో 35 సంవత్సరాల నుంచి సేద్యం చేసుకుంటున్న పేద రైతు కుటుంబంపై ఖబ్జాకోరులైన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కన్నువేసి అక్రమంగా పేద రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారన్నారు.
పోలీసులను మచ్చిక చేసుకొని నిత్యం పేద కుటుంబాలపై దాడి ఎంతవరకు న్యాయం అనేది పాలకులు, అధికారులు ఆలోచించాలని కోరారు. ఓఆర్ఎస్ చట్టం ప్రకారం 12 సం వత్సరాలు ప్రభుత్వ భూమిలో సేద్యం చేసుకొనే వారికి యాజమాన్య హక్కు కూడా ఉంటుందని, దీనికి తగినట్లుగా అధికారులు కూడా పేద రైతులకు పట్టాలు ఇప్పించే విధంగా బాధ్యతలు తీసుకోవాలని కోరారు. దొంగలకు సద్దులు మోసే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పేదలకు న్యాయం చేయడం కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మేడారం వచ్చి నిరుపేద రైతులకు పట్టాలు ఇప్పించి ఆయన చిత్తశుద్ధిని చూపించాలన్నారు. రైతులు, పేదల ప్రజలపైన ఇవే దాడు లు చేస్తే కచ్చితంగా రానున్న రోజుల్లో పోలీస్‌స్టేషన్ ముందే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. పోలీసులు రాజకీయ నాయకులుగా మారి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను, కార్యకర్తలను పార్టీ మా రాలని ఒత్తిడి చేస్తున్నారని, అది వారికి సరికాదన్నారు.
గతంలో రేషన్ బియ్యా న్ని దొంగదారి పట్టించిన అక్రమార్కుల మాటలు విని పేద రైతు కుటుంబాన్ని హింసించడం సరికాద ని, వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని అ న్నారు. అనంతరం బాధితులు మాట్లాడు తూ..30 సంవత్సరాలుగా ఆభూమిని నమ్ముకొని సేద్యం చేసుకుంటున్నామని, తమ ని కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆ పొలాన్ని అమ్మాలని కోరగా మీము బతికేది దీనిపైనేనని, అమ్మి మీము ఎటుపోవాలని ప్రశ్నించగా అప్పటి నుంచి వారిపైన అక్రమ కేసులు బనాయిస్తూ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిప్పడంతోపాటు మహిళ అని చూడకుండా అసభ్య పదజాలతో దూ షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భర్త సంకలబుడ్డి శీనయ్య, కొడుకు నవీన్‌ను అత్యంత కిరాతకంగా, దారుణంగా కొట్టడంతో నడవలేని పరిస్థితికి తీసుకవచ్చారని, తమ పరిస్థితిని చూసి జడ్జీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఎస్ఐపై చ ర్య లు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాం డ్ చేశారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరిబండి సురేశ్‌బాబు, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అ ప్పిరెడ్డి, మాజీఎంపీపీ చెన్నబోయిన సైదులు, పట్టణ, మండల ప్రధాన కార్యదర్శులు చిత్తలూరి సైదు లు, యల్లబోయిన లింగయ్య, చిల్లేపల్లి పీఏసీఎస్ మాజీ చైర్మ న్ అనంతు శ్రీనివాస్, రాపోలు నవీన్‌కుమార్, పల్లెపంగ నాగరాజు, సుదర్శన్, భరత్ ఉన్నారు.