గట్టుప్పల్, జూన్ 18 : చండూరు ఎంపీపీగా గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ ఎంపీటీసీ అవ్వారి గీతా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మంగళవారం ఆర్డీఓ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో చండూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపికను నిర్వహించారు. 5 మంది బీఆర్ఎస్ ఎంపీటీసీలు హాజరయ్యారు. అనంతరం అవ్వారి గీతను ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ ఎంపీపీ పల్లె కళ్యాణీరవికుమార్తో పాటు, పెందోట వెంకటమ్మ, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్నికకు హాజరు కాలేదు. గతంలో ఎంపీపీ ఎన్నిక నిర్వహించినా కోరం లేక వాయిదా పడింది.
ఈసారి కోరంతో సంబంధం లేకుండా వచ్చిన మెజార్టీ సభ్యులతోనే ఎంపీపీ ఎన్నిక నిర్వహించినట్లు ఆర్డీఓ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇన్చార్జి ఎంపీపీగా ఉన్న అవ్వారి గీత ఇప్పుడు పూర్తిస్థాయి ఎంపీపీ బాధ్యతలు చేపట్టారు. ఆమెకు పలువురు ప్రజాప్రతినిధులు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ఎంపీడీఓ అనురాధ, ఎంపీటీసీలు గొరిగె సత్తయ్య, చెరుపల్లి భాస్కర్, కావలి మంగమ్మ, తిప్పర్తి లక్ష్మమ్మ, సూపరింటెండెంట్ మనోహర్, చంద్రయ్య, అంజయ్య, కిశోర్, ఆనంద్, అయోధ్య పాల్గొన్నారు.